జనసేన జెండా పాట

వచ్చే ఎన్నికల నాటికి జనాల్లోకి చొచ్చుకు వెళ్లాలని భావిస్తున్న జనసేన ప్రణాళికలో భాగంగా తన భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తోంది. ఇప్పటికే జనసేన తమ పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించేలా వివిధ పాటలను విడుదల చేసిన ఆ పార్టీ తాజాగా జనసేన జెండా పాట పేరిట ఈ రోజు మరో పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాయగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా.. తెల్లా తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా.. ఎర్రటి గుండెల జెండా అంటూ సాగుతున్న పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు విపరీతంగా షేర్ చేస్తున్నారు.