తిరుమలలో జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు... ఇప్పటికే తిరుపతి చేరుకున్న పవన్... అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు... త్వరలోనే ఏపీలో బస్సు యాత్ర ప్రారంభించనున్న పవన్... అంతకు ముందు శ్రీవారిని దర్శించుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఆయన తిరుమలలో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు అమిత్‌షా కాన్వాయ్‌పై తాజాగా టీడీపీ శ్రేణులు దాడికి యత్నించిన ఘటనతో అప్రమత్తమైన పోలీసులు పవన్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు... దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను క్లిక్ చేయండి...