ఎక్కడ చూసినా లంచమే...

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా లంచమే రాజ్యమేలుతోందని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మహాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రేషన్ కార్డు కావలన్న లంచం... పెన్షన్ కావాలన్న లంచం... ఆఖరికి మరుగుదొడ్లు కావాలన్న లంచమే ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. సీఎం చంద్రబాబు దళారులకు నాయకుడుగా మారి రైతాంగాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించిన జగన్... రైతుల దగ్గర తక్కువ ధరలకు తీసుకుని హెరిటేజ్ లో ప్యాకింగ్ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు, పోలవరం ప్రాజెక్టు... ఇతర అంశాలపై ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...