తెలంగాణ - CLICK HERE

చేవెళ్ల
చేవెళ్ల

2009లో ఏర్పడిన చేవెళ్ల పార్లమెంటరీ నియోజవర్గానికి 20014లో జరిగిన సాధారణ ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధి, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా విశ్వేశ్వర రెడ్డి 73023 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. విశ్వేశ్వర రెడ్డి ప్రముఖ స్వాతంత్రయోధుడు, మాజీ డిప్యూటీ సిఎం కెవి.రంగారెడ్డి మనమడు, అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి అల్లుడు కూడా ..
కాంగ్రెస్ అభ్యర్ధి కార్తీక్ రెడ్డి మాజీ మంత్రులు ఇంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి దంపతుల కుమారుడు. 
విశ్వేశ్వరరెడ్డికి 435077 ఓట్లు వస్తే.. కార్తీక్ కు 363053 ఓట్లు వచ్చాయి. మూడోస్ధానంలో ఉన్న టి.దేవేందర్ గౌడ్ కు 353203 ఓట్లు పోల్ అయ్యాయి. వీరేందర్ గౌడ్  టిడిపి సీనియర్ నేత , మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు. ఇక వైసిపి తరపున పోటీ చేసిన కొండా రాఘవరెడ్డికి 40135 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారు. ఈయన కూడా మాజీ సిఎం కొండా రంగారెడ్డి బంధువే. 2014 లోక్ సభ నియోజవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ కు మెజార్టీ వచ్చింది.  మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపికి మెజార్టీ వచ్చినా మూడో స్థానంలో ఉండటం విశేషం. 
టిఆర్ఎస్ కు వికారాబాద్ లో 20871, తాండూరులో 18923, చేవేళ్లలో 26685, పరిగిలో 2754 ఓట్ల మెజార్టీ వచ్చింది. టిడిపికి మహేశ్వరంలో 29702, రాజేంద్రనగర్ లో 20762, శేర్ లింగంపల్లిలో 76700 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వికారాబాద్, తాండూరు, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్లలో రెండోస్థానంలో నిల్చింది. అయితే పరిగిలో లోక్ సభకు మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగి టిఆర్ఎస్ కు మెజార్టీ వచ్చింది. 
2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెల్చిన  ఎస్. జైపాల్ రెడ్డి  కేంద్రమంత్రిగాను పని చేశారు. 

Activities are not Found
No results found.