తెలంగాణ - CLICK HERE

మల్కాజిగిరి
మల్కాజిగిరి

2009లో కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి సిహెచ్.మల్లారెడ్డి విజయం సాధించారు. తెలంగాణలో టిడిపి ఇదొక్క సీటునే సాధించగలిగింది. మల్లారెడ్డి పలు విద్యాసంస్థల అధిపతి. మల్లారెడ్డికి 523356 ఓట్లు వస్తే.. సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ కు చెందిన మైనంపల్లి హనుమంతరావుకు 495190 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేసిన  కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ 233530 ఓట్లు సాధించారు. మల్లారెడ్డికి 28166 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ పోటీ చేసిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు 158248 ఓట్లతో నాలుగోస్థానం, వైసిపి తరపున పోటీ చేసిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి 115221 ఓట్లు తెచ్చుకుని ఐదో స్థానికి పరిమితమయ్యారు. 
మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గానూ టిఆర్ఎస్ మూడుచోట్ల , టిడిపి నాలుగుచోట్ల అధిక్యత సాధించాయి.  టిఆర్ఎస్ మేడ్చల్ లో 44438 ఓట్లు, మల్కాజిగిరిలో 14223, ఉప్పల్ లో 7331 ఓట్లు అధిక్యత తెచ్చుకున్నాయి. టిడిపి కుత్బుల్లాపూర్ లో 29506, కూకట్ పల్లిలో 41608, ఎల్బీ నగర్ లో 20204, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 4204 ఓట్ల అధిక్యతను తెచ్చుకుని సీటును కైవసం చేసుకుంది టిడిపి. ఉప్పల్ నియోజకవర్గంలో టిడిపి మద్దతుతో బిజెపి అభ్యర్ది ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ అసెంబ్లీకి ఎన్నికవ్వగా.. లోక్ సభ ఎన్నికలలో మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగి టిఆర్ఎస్ అభ్యర్ధికి మెజార్టీ రావడం విశేషం. 
జనరల్ సీటులో ఎస్సీ నేతగా ఉన్న సర్వే సత్యనారాయణ ఒక్కడ ఒక్కసారి గెలవగా.. మరోసారి సిద్దిపేటలో గెల్చారు. ఈసారి మల్లారెడ్డి గెలుపొందారు. 

Activities are not Found
No results found.