తెలంగాణ - CLICK HERE

మెదక్
మెదక్

మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి రెండుచోట్ల గెలుపొందారు. ఆ తర్వాత ఆయన మెదక్ సీటును వదులుకున్నారు. తెలంగాణ, ఏపిలో కానీ లోక్ సభ, శాసనసభలకు రెండుసార్లు పోటీ చేసి.. రెండుచోట్ల గెలిచి రికార్డు సృష్టించిన ఏకైక వ్యక్తి కేసిఆర్. 2004లో సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి రెండుచోట్ల గెలిచారు. అప్పుడు శాసనసభ సీటును వదులుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రమంత్రి పదవికి, రెండుసార్లు ఎంపి పదవికి రాజీనామా చేశారు. ఆ రెండు ఉప ఎన్నికలలో కరీంనగర్ నుంచి గెలుపొంది మరో రికార్డు సృష్టించారు. 
2009 ఎన్నికలో మహబూబ్ నగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మొత్తం మీద ఐదుసార్లు లోక్ సభకు, ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో గజ్వేల్ నుంచి ఎన్నికయ్యాక తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. కేసిఆర్ కు 657492 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి పి.శ్రవణకుమార్ రెడ్డికి 2604463 ఓట్లు వచ్చాయి. కేసిఆర్ కు 397029 ఓట్ల మెజార్టీ వచ్చింది. టిడిపి మద్దతుతో పోటీ చేసిన బిజెపి అభ్యర్ది నరేంద్రనాథ్ కు 181804 ఓట్లతో మూడో స్థానంలో నిల్చారు. 
సిఎంగా బాధ్యతలు చేపట్టి ఎంపి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె. ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నామా లక్ష్మిరెడ్డికి 210524, బిజెపి అభ్యర్ధి జగ్గారెడ్డికి 186343 ఓట్లు వచ్చాయి. 
లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. సిద్దిపేటలో 86789, మెదక్ లో 52444. నర్సాపూరులో 22954, సంగారెడ్డిలో 48607, పటానుచెరులో 36785, దుబ్బాకలో 56000, గజ్వేలులో 53880 ఓట్ల మెజార్టీ వచ్చింది.
మెదక్ నియోజకవర్గంలో 16 ఎన్నికలు జరగ్గా.. పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్ నాలుగుసార్లు, కాంగ్రెస్ ఐ ఐదుసార్లు, టిపిఎస్ , టిడిపి , బిజెపి ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు గెలుపొందాయి. 

Activities are not Found
No results found.