తెలంగాణ - CLICK HERE

నిజామాబాద్
నిజామాబాద్


నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ అధినేత్రి కవిత విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి మధుయాష్కీపై 167184 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన మధుయాష్కీ 2014లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. 
నిజామాబాద్ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. ఆర్మూర్ లో 12420, బోధన్ 21483, నిజామాబాద్ అర్భన్ లో 11973, నిజామాబాద్ రూరల్ లో 31114, బాల్కొండలో 45671, కోరుట్లలో 23151, జగిత్యాలలో 2779 ఓట్ల మెజార్టీని కవిత సాధించారు. ఒక్క జగిత్యాలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. అసెంబ్లీకి సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎన్నకవ్వగా.. లోక్ సభకు మాత్రం కవితకే మెజార్టీ రావడం విశేషం. 
బాల్కొండ, కోరుట్ల సెగ్మెంట్ లో బిజెపి రెండో స్థానం సాధించింది. లోక్ సభ బిజెపి అభ్యర్ధి ఎండల లక్ష్మీనారాయణకు 225333 ఓట్లు రావడంతో మూడోస్థానంలో నిల్చారు. కవితకు 439307 ఓట్లు, మధుయాష్కీకి 272123 ఓట్లు వచ్చాయి. 
నిజామాబాద్ లో 16 ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐ ఆరుసార్లు, టిడిపి మూడుసార్లు, ఇండిపెండెంటు ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెల్చాయి. ఇక్కడ హెచ్.సి.హెడ , ఎమ్.రామగోపాలరెడ్డి, గడ్డం గంగారెడ్డి మూడుసార్లు నెగ్గారు. బాలాగౌడ్ , మధుయాష్కి రెండుసార్లు, నారాయణరెడ్డి, ఆత్మచరణ్ రెడ్డి, కవితలు ఒక్కొక్కసారి గెలిచారు. 

Activities are not Found
No results found.