తెలంగాణ - CLICK HERE

సికింద్రాబాద్
సికింద్రాబాద్

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో సీనియర్ బిజెపి నేత , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నాలుగోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కేబినెట్ లో కొంతకాలంగా మంత్రిగా పని చేశారు. దత్తాత్రేయకు 438271 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్ధి అంజన్ కుమార్ యాదవ్ కు 183536 ఓట్లు లభించాయి. దత్తాత్రేయకు 254735 ఓట్ల అధిక్యత రావడం విశేషం. అంజన్ కుమార్ యాదవ్ రెండుసార్లు వరుసగా గెల్చి, ఈసారి ఓటమి పాలయ్యారు. 
ఎంఐఎం అభ్యర్ధి ఎన్.మోహన్ రావు 14510 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితమయ్యారు. టిఆర్ఎస్ అభ్యర్ధి భీమ్ సేన్ 143874 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. వైసిపి తరపున పోటీ చేసిన సయ్యద్ సజ్జద్ కు కేవలం 45189 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజిపి అధిక్యత తెచ్చుకోగా.. ఒక్క నాంపల్లిలో మాత్రం ఎంఐఎం మెజార్టీ పొందింది.  ముషీరాబాద్ లో 45844, అంబర్ పేటలో 58595, ఖైరతాబాద్ లో 31328, జూబ్లీహిల్స్ లో 31277, సనత్ నగర్ లో 40768, సికింద్రబాద్ లో 30059 ఓట్ల అధిక్యత బిజెపి సాధించుకుంది. నాంపల్లిలో ఎంఐఎం కు 39249 ఓట్ల మెజార్టీ వచ్చింది. సికింద్రాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. లోక్ సభకు మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగి బిజెపి మెజార్టీ పొందింది. 
సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం 18సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐ ఎనిమిదిసార్లు, టిపిఎస్ ఒకసారి, బిజెపి నాలుగుసార్లు గెలిచింది.  ఇక్కడ దత్తాత్రేయ అత్యధికంగా నాలుగుసార్లు విజయం సాధించగా.. కాంగ్రెస్ నేతలు పి.శివశంకర్ రెండుసార్లు,తెనాలిలో మరోసారి గెలిచారు,హషీం, మణెమ్మ అంజయ్య, అంజన్ కుమార్ యాదవ్ లు రెండేసి సార్లు గెలిచారు. ఎ.మోహియుద్దీన్ సికింద్రాబాద్ లో రెండుసార్లు, హైదరాబాద్ లో ఒకసారి గెలిచారు. బిఎ.మీర్జా సికింద్రాబాద్ లో ఒకసారి , వరంగల్ లో ఒకసారి గెలిచారు. ఎస్.ఎ.ఖాన్ , టి.అంజయ్య, పివి.రాజేశ్వరరావులు ఒక్కసారి గెలిచారు. 

Activities are not Found
No results found.