తెలంగాణ - CLICK HERE

జహీరాబాద్
జహీరాబాద్


జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ టిఆర్ఎస్ తరపున పోటీ చేసి బిబి.పాటిల్ విజయం సాధించారు. పాటిల్ 144631 ఓట్ల ఆధిక్యత గెల్చారు. ఆయనకు 508661 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ది సురేష్ షెట్కార్ కు 364030 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిల్చిన టిడిపి అభ్యర్ధి కె.మదన్ మోహన్ రావుకు 157497 ఓట్లు లభించాయి.  
జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క నారాయణ ఖేడ్ లో తప్ప మిగిలిన అన్ని సెగ్మెంట్లో టిఆర్ఎస్ కు అధిక్యత లభించింది. జుక్కల్ లో 17527, బాన్స్ వాడలో 32291, ఎల్లారెడ్డిలో 35343, కామారెడ్డిలో 13410, ఆందోల్ లో 14760, జహీరాబాద్ లో 3212 ఓట్ల అధిక్యత టిఆర్ఎస్ కు వచ్చింది. నారాయణఖేడ్ లో మాత్రం కాంగ్రెస్ కు 10719 ఓట్లు మెజార్టీ వచ్చింది. 
రద్దు అయిన సిద్ధిపేట లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఐ ఆరుసార్లు, టిడిపి మూడుసార్లు గెలుపొందాయి. సీనియర్ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి సిద్ధిపేటలో మూడుసార్లు గెలిస్తే .. పెద్దపల్లిలో నాలుగుసార్లు విజయం సాధించారు. మరో సీనియర్ నేత నంది ఎల్లయ్య సిద్ధిపేటలో ఐదుసార్లు గెలవగా, 2014లో నాగర్ కర్నూలు నుంచి లోక్ సభ కు ఆరోసారి ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు , ఒక్కసారి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. మరో నేత ఎం.రాజయ్య రెండుసార్లు ఇక్కడ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వగా .. సర్వే సత్యనారాయణ సిద్దిపేటలో ఒకసారి , మల్కాజిగిరి జనరల్ సీటు నుంచి మరోసారి విజయం సాధించారు. విజయరామారావు ఒకసారి గెలుపొందారు. ఇది మొదటి నుంచి రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. 

Activities are not Found
No results found.