కాంగ్రెస్ నేతలపై జవదేకర్ ఫైర్...

కర్ణాటక అసెంబ్లీలో ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాలు... అనంతరం నేతలు చేసిన వ్యాఖ్యలు మరోసారి బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుస్తున్నాయి. యడ్యూరప్ప రాజీనామా అనంతరం కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లు, గవర్నర్ పై వారు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్... కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే నవ్వు తెప్పించే విధంగా ఉందంటూ ఎద్దేవా చేశారాయన. కాంగ్రెస్‌ గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేస్తాయని ఆ పార్టీ నేతలు అంటారు... ఓడిపోతే మాత్రం ఈవీఎంలు టాంపరింగ్ చేశారంటూ సెటైర్లు వేశారాయన. 

నకిలీ సీడీలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసిందంటూ ఆరోపణలు గుప్పించిన జవదేకర్... ఎన్నికల ప్రచారంలో తిట్టుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఇప్పుడు ఎలా కలుస్తాయని ప్రశ్నించారు... ఓ చోట సిద్ధరామయ్య ఘోరంగా ఓడిపోయి మరోచోట స్వల్ప మెజార్టీతోనే బయటపడ్డాడని... ఆ పార్టీకి చెందిన 14 మంది మంత్రులు ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు... ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...