ఈ కోర్సులో భారీగా సీట్ల కోత

ఈ కోర్సులో భారీగా సీట్ల కోత

తెలంగాణలోని పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 10,122 సీట్లకు ఏఐసీటీఈ కోత పెట్టింది.14 కాలేజీల్లో ప్రవేశాలకు నో చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు, సీట్ల జాబితాను ప్రకటించింది. అనుమతులు ఇచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు పంపించింది. గతేడాది రాష్ట్రంలోని 242 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,24,239 సీట్లకు అనుమతినివ్వగా ఈసారి 228 కాలేజీల్లోని 1,14,117 సీట్లకే అనుమతులు ఇచ్చింది. అత్యధికంగా రంగారెడ్డిలో ఆరు కళాశాలలు మూతపడనున్నాయి. ఈ జిల్లాలో ఏకంగా 3906 సీట్లకు కోత పడింది. అన్ని జిల్లాల్లో సీట్ల సంఖ్య తగ్గగా.. హైదరాబాద్‌లో మాత్రం 525 సీట్లు పెరగడం గమనార్హం. ఇక.. పాత రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 14 కాలేజీలు మూతపడ్డాయి.