మహేష్, నమ్రతల బంధానికి 14 ఏళ్ళు !

మహేష్, నమ్రతల బంధానికి 14 ఏళ్ళు !

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలిసిందే.  మహేష్ బుబును వివాహమాడిన తర్వాత మెల్లగా నటనను పక్కనబెట్టేసి నమ్రత పిల్లల్ని చూసుకోవడం, మహేష్ బాబుకు అన్ని వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు.  మహేష్ ఇంత వేగంగా ఎదగడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వెనుక ఆయన కష్టంతో పాటు నమ్రత విజన్ కూడా ఉందని అంటుంటారు సినీ జనం.  అంతలా మహేష్ బాబు జీవితంలో కలిసిపోయింది నమ్రత.  వీరి వివాహమై ఈరోజుకి 14 ఏళ్లు కావొస్తోంది.  ఈ సందర్బంగా మహేష్ నమ్రతకు శుభాకాంక్షలు తెలిపాడు.