ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన తిరుపతిలోని బీటీఆర్ కాలనీలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంకు చెందిన భర్త, భార్య, కుమారుడు, కుమార్తె ఉరివేసుకున్నారు. అయితే కుమార్తె మాత్రం క్షేమంగా బయటపడింది. అప్పుల బాధ తాళలేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనతో కాలనీ వాసులు అందరూ విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు.