ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం..

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం..

హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు... రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రావిరాల దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున రవిరాల దగ్గర ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్ నుండి బొంగుళూరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఏలూరు నుంచి పేషెంట్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా... నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే కారణంగా భావిస్తున్నారు పోలీసులు.