ముగ్గురు మృతి, బస్సులో ఇరుకున్న 10 మంది...

ముగ్గురు మృతి, బస్సులో ఇరుకున్న 10 మంది...

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది... భోగాపురం మండలం పోరిపల్లి దగ్గర టూరిస్టు బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సు బోల్తాపడగా... ముగ్గురు మృతిచెందారు... బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొనడంతో బస్సు బోల్తాపడినట్టు తెలుస్తోంది. ఇక లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మరోవైపు బోల్తా పడిన బస్సులో ప్రయాణికులు ఇరుకున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేక బస్సులోనే మగ్గుతున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు... సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.