2 రోజుల్లో రూ. 4 లక్షల కోట్లు పోయే

2 రోజుల్లో రూ. 4 లక్షల కోట్లు పోయే

కేవలం రెండే రెండు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు కోల్పోయింది. నిన్న 376 పాయింట్లు క్షీణించి బీఎస్ఈ సెన్సెక్స్ ఇవాళ మరో 509 పాయింట్లు పడింది. అంటే రెండు రోజుల్లో 976 పాయింట్లు క్షీణించింది. ఈ లెక్కన బీఎస్‌ఈ లో లిస్ట్‌ అయిన షేర్ల విలువ రూ. 4 లక్షల కోట్లు తగ్గింది. అంటే ఆ మేరకు ఇన్వెస్టర్ల సంపద కరిగిందన్నమాట. చైనా వాణిజ్య యుద్ధ భయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు క్షీణిస్తుండగా.. భారత మార్కెట్లు రూపాయి పతనం కారణంగా తగ్గుతున్నాయి. నిఫ్టికి అత్యంత కీలకమైన స్థాయి 11300. ఈ స్థాయిని ఇవాళ నిఫ్టి కోల్పోయింది.  జీడీపీ వృద్ధి రేటు పెరిగినా.. ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్ ను ఘోరంగా దెబ్బతీసింది.  రూపాయి పతనం నిరాటకంగా కొనసాగుతోంది. ఇదే స్థాయిలో కాకున్నా... రూపాయి మరింత బలహీన పడే పక్షంలో.. వచ్చే నెల పరపతి విధాన సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం అధికంగా ఉంది. ఇది మార్కెట్లకు పెద్ద దెబ్బ.  కనీసం పావు శాతం మేర వడ్డీని ఆర్బీఐ పెంచుతుందని  బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి.