గుడ్డు కోసం వెళ్తే.. గర్భస్రావం

గుడ్డు కోసం వెళ్తే.. గర్భస్రావం

గుడ్డు కోసం వెళ్తే.. ఓ ఆరు నెలల గర్భిణీకి గర్భస్రావం అయింది. ఈ విషాద ఘటన ఇల్లందులోని టేకులపల్లిలో చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాలోని మాళోత్ పద్మ ఆరు నెలల గర్భిణీ. ప్రభుత్వం గర్భిణీలకు గుడ్డు, పాలు, ఆహరం అందిస్తుండడంతో.. వాటిని తెచ్చుకునేందుకు పద్మ అంగంవాడీ దగ్గరకి వెళ్ళింది. పద్మ అక్కడ  పనిచేస్తున్న ఆయాను గుడ్లు అడగ్గా.. ఘర్షణకు దిగింది. పక్కనే అంగన్ వాడీ టీచర్ ఉన్నప్పటికీ స్పందించలేదు. గర్భిణీ అని కూడా చూడకుండా పద్మపై ఆయా విచక్షణ రహితంగా చేయిచేసుకుంది. దీంతో పద్మకు గర్భస్రావం అయింది. వెంటనే 108 సాయంతో కొత్తగూడెం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.