ఎస్సీ గురుకులాల్లో 750 పోస్టులకు నోటిఫికేషన్

ఎస్సీ గురుకులాల్లో 750 పోస్టులకు నోటిఫికేషన్

ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల సోసైటీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 750 పోస్టులను భర్తీకి ఏపీ ఎస్సీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 22 ఏళ్ల తరువాత ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. జిల్లా కోఆర్డినేటర్లు 4, ప్రిన్సిపాల్స్ 27, టీజీటీలు 552, వార్డెన్లు 167 పోస్టులను భర్తీ చేసేందుకు ఆన్ లైన్ ద్వారా అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. జోన్ల వారీగా ఒకటో జోన్ లో 79 టీజీటీలు, 32 వార్డెన్లు, రెండో జోన్ లో 159 టీజీటీలు, 41 వార్డెన్లు, మూడో జోన్ లో 163 టీజీటీలు, 41 వార్డెన్లు,  నాలుగో జోన్ లో 151 టీజీటలు, 53 వార్డెన్లు పోస్టులను భర్తీ చేయనున్నారు.