తిత్లీ బీభత్సం: ఎనిమిది మంది మృతి...

తిత్లీ బీభత్సం: ఎనిమిది మంది మృతి...

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది... ఈ తుఫాన్‌తో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. మృతి చెందిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐదుగురు, విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారని తెలిపారు అధికారులు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి మరొకరు మృతిచెందారు. కాకినాడ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మొత్తం 67 బోట్లలో 65 బోట్లు వెనక్కి వచ్చాయి... సముద్రంలో చిక్కుకున్న మిగతా రెండు బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.