89 ఏళ్ళ బసవరాజ్ పీహెచ్ డీకి రెడీ

89 ఏళ్ళ బసవరాజ్ పీహెచ్ డీకి రెడీ

యువకునిగా ఉన్నపుడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన శ్రవణ బసవరాజ్ 89 ఏళ్ళ ప్రాయంలో పీహెచ్‌ డీ చేయాలని తాపత్రయపడుతున్నారు. కొప్పల్ జిల్లాకు చెందిన బసవరాజ్ పీహెచ్ డీ చేసేందుకు ఇప్పటికే కర్ణాటక యూనివర్సిటీలు పెట్టిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇంతకుమునుపు కూడా ఈ పరీక్ష రాశానని, కాని అర్హత పొందలేదని, ఈ సారి కచ్చితంగా అర్హత సాధిస్తాననే ధీమాను బసవరాజ్ వ్యక్తం చేశారు. టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన బసవరాజ్ 61 ఏళ్ళ వయసులో ఎల్ఎల్ బీ చేశారు.  తరవాత ఆర్ట్స్ లో మాస్టర్స్ చేశారు.