ఇది కేటీఆర్, ఇవాంకా రోడ్డు ఎందుకో తెలుసా..?

ఇది కేటీఆర్, ఇవాంకా రోడ్డు ఎందుకో తెలుసా..?

ప్రభుత్వ ఉదాసీనతకు.. అధికారుల నిర్లక్ష్యం పట్ల సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి వాసులు విభిన్నంగా నిరసన తెలిపారు. తమ కాలనీ మీదుగా వెళ్లే రహదారి గుంతలు పడటంతో దానిని బాగు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. సంగీత్ థియేటర్ క్రాస్ వద్ద నుంచి ఏఓసీ సర్కిల్, సఫిల్‌గూడ, మల్కాజ్‌గిరి, యాప్రల్, అడ్డగుట్టలను కలిపే ఈ రహదారి పరిస్థితి నానాటికి దిగజారటం.. అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఈ కాలనీ వాసులు మున్నాభాయ్ చట్టం కింద అధికారులకు జ్ఞానోదయం కలిగించాలనుకున్నారు. కొందరు యువకులు ఒక గ్రూప్‌గా ఏర్పడి తమ సొంత డబ్బుతో కాంక్రీట్ మిక్స్, చిన్న చిన్న గులకరాళ్లు కొనుగోలు చేసి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. నిన్న ఉదయం 10.30కి పని ప్రారంభించి 12 గంటలకల్లా పూర్తి చేశారు. అనంతరం తాము బాగు చేసిన రోడ్డుకు కేటీఆర్-ఇవాంకా రోడ్డుగా నామకరణం చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.