ప్రశ్నేదైనా.. 'ఎ' ఆప్షనే!

ప్రశ్నేదైనా.. 'ఎ' ఆప్షనే!

ప్రవేశ పరీక్షల నిర్వహణలో తమ శైలే వేరని మరోసారి నిరూపించారు కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు. ఇటీవల విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంఎస్‌డబ్ల్యూ పీజీ ప్రవేశ పరీక్షలో అన్ని ప్రశ్నలకే 'ఎ' ఆప్షన్‌నే సమాధానంగా ఇచ్చి వివాదానికి తెరతీశారు. ఈ పరీక్ష ప్రాథమిక 'కీ' నిన్న విడుదలైంది. తమకెన్ని మార్కులొస్తాయా అని అభ్యర్థులు ఆశగా ఆ 'కీ'ని చూడగా అన్ని ప్రశ్నలకూ 'ఎ' జవాబే ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఎ, బి, సి, డిల రూపంలో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో రూపొందించిన ప్రశ్నపత్రంలో అన్నింటికీ 'ఎ' జవాబే ఉండడంతో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని భావించారు. పొరపాటేం లేదని, అన్నింటికీ సరైన సమాధానం 'ఎ' అని అధికారులు చెప్పారు. దీంతో విద్యార్థులు కంగుతిన్నారు.