అరుదైన చైనా బాతు అమెరికాలో...

అరుదైన చైనా బాతు అమెరికాలో...

చైనాలో కనిపించే అరుదైన, అందమైన బాతు న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ పార్కు సరస్సులో కనిపించింది. అనేక రంగుల మేళవింపుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ బాతు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముక్కు ఒక రంగులో ఉంటే తోక మరో రంగులో, మూపురం, జూలు, జుట్టు.. ఇలా ప్రతి అవయవం కూడా ప్రత్యేకమైన రంగులో మెరిసిపోతోంది. 
చైనాలో ఈ రకమైన బాతును సుష్ గా పిలుస్తారట. ఇవి జంటగా తప్ప ఒంటరిగా కనిపించవట. దీన్ని మాత్రం యువాన్ యువాన్ అంటారు. ఆడ-మగ మధ్య ప్రేమను తెలిపేందుకు యువాన్ యువాన్ అని చైనీస్ లో అంటారట.