దేవుడిలా వచ్చి ప్రాణాల్ని నిలబెట్టిన అమీర్ ఖాన్ !

దేవుడిలా వచ్చి ప్రాణాల్ని నిలబెట్టిన అమీర్ ఖాన్ !

అమీర్ ఖాన్ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు.  తనతో కలిసి పనిచేసిన వ్యక్తికి ప్రాణాపాయ స్థితి సంభవిస్తే స్వయంగా రంగంలోకి దిగి అన్నీ తానై చూసుకున్నాడు అమీర్.  వివరాల్లోకి వెళితే నేషనల్ అవార్డ్ సౌండ్ డిజైనర్, అమీర్ యొక్క సూపర్ హిట్ సినిమా 'దంగల్' కు పనిచేసిన షాజిత్ కోయెరి గురువారం తీవ్ర అవస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను బాంద్రాలోని లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 

అడ్మిషన్ తర్వాత ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేసిన సిబ్బంది ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అని తేల్చారు.  కానీ సరైన సమయానికి వైద్యం మాత్రం అందించలేదు.  గంటల తరబడి ఎలాంటి వైద్యం అందకుండా  షాజిత్  స్కానింగ్ రూమ్ బయట అలానే ఉన్నారు.  దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అమీర్ ఖాన్ ను సంప్రదించారు.

ఫోన్ కాల్ కు స్పందించిన అమీర్ వెంటనే అర్థరాత్రి హాస్పిటల్ కు చేరుకొని, అక్కడి నుండే అనిల్ అంబానీకి ఫోన్ చేసి అంధేరిలో ఉన్న కోకిలబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి  షాజిత్ ను తరలించి వైద్యం అందేలా చేశారు.  ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు.  ఇలా అర్థరాత్రి దేవుడిలా వచ్చి సహాయం చేసినందుకు షాజిత్ కుటుంబ సభ్యులు అమీర్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.