సూపర్‌ కింగ్స్‌తో పోటీకి ఏబీ రెడీ..

సూపర్‌ కింగ్స్‌తో పోటీకి ఏబీ రెడీ..

 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పూణె వేదికగా ఇవాళ జరిగే మ్యాచ్‌తో హర్డ్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ కోచ్‌ డానియల్‌ వెటోరీ ధృవీకరించాడు. వైరల్‌ ఫీవర్ కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో డివిలియర్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఇప్పుడు డివిలియర్స్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, చెన్నైతో మ్యాచ్‌లో సత్తాచాటుతాడని వెటోరీ చెప్పాడు. ఇక..స్వదేశంలో జరిగే ఓ వివాహానికి హాజరు కావడానికి  వికెట్‌కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ దక్షిణాఫ్రికా వెళ్తున్నందున ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలిపాడు. దీంతో.. అతని స్థానంలో పార్థివ్‌పటేల్‌కు చోటు లభించే అవకాశం ఉంది. సీజన్‌లో ఇప్పటివరకు బెంగళూరు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.