రాజీవ్ రహదారిపై ప్రమాదం, నలుగురు మృతి

రాజీవ్ రహదారిపై ప్రమాదం, నలుగురు మృతి

సిద్ధిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై జరిగినప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్ మండలం రిమ్మలగూడ సమీపంలో రహదారిపై ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు వర్గల్ మండలం పాములపర్తి వాసులుగు గుర్తించారు. చేర్యాల మండలంలో అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఆటో సుమారు 20 వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటనపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిచారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని హామి ఇచ్చారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.