జయరాం హత్య కేసు: హైదరాబాద్‌కు నిందితులు..

జయరాం హత్య కేసు: హైదరాబాద్‌కు నిందితులు..

సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితులను హైదరాబాద్‌కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. ఆ ఇద్దరిని హైదరాబాద్ కు తరలించారు. ఇవాళ సాయంత్రంలోగా హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో నిందితులను హాజరుపర్చనున్నారు పోలీసులు.