కేసీఆర్‌ను ప్రకాష్ రాజ్ ఎందుకు కలిశారంటే...

కేసీఆర్‌ను ప్రకాష్ రాజ్ ఎందుకు కలిశారంటే...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటుడిగానే కాదు రాజకీయంగాను ఇపుడు పాపులర్ అయ్యాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ కర్ణాటకలో బీజేపీకి తలనొప్పిగా మారారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై స్పందించారు. కేంద్రంలో సెంటర్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లాంటివారు పనిచేయరు.. ప్రతి స్టేట్ కి ఒక ప్రాంతీయ పార్టీ కావాలని చర్చల కోసం కేసీఆర్ కర్ణాటకు వచ్చారు అంతేతప్ప మద్దతు కోసం కాదు అని అన్నారు.

కేసీఆర్‌ను తాను కలిసింది కేవలం పంచాయతీరాజ్ బిల్లుపై మాట్లాటడాని మాత్రమే అని అన్నారు. ఆయనకు నామీద ప్రేమ ఉంది కాబట్టి.. నా ఆలోచన ఆయనకు నచ్చింది, అయన కొన్ని ఆలోచనలు నాకు నచ్చాయి కాబట్టి ఉభయకుశలోపరి సంప్రదాయన్ని అనుసరించి ఆయన్ను కలిశాను అని తెలిపారు. మరోవైపు తను కేసీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎవరి ఇష్టానికి వారు చెపుతుంటారు.. అలాంటిది ఏమి లేదు అని తెలిపారు.