హీరోలకంటే.. వీరికే కలిసొచ్చింది..!!

హీరోలకంటే.. వీరికే కలిసొచ్చింది..!!

ఒక హీరో సినిమా చేయడానికి చాలా ఆలోచించాలి.  మంచి కథ, కథనాలతో పాటు తన ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలను అందులో ఉండే విధంగా చూసుకోవాలి.  అలా ఉంటేనే ఫ్యాన్స్ ఆదరిస్తారు.  సినిమా చూస్తారు.  ఇవన్నీ ఉండే విధంగా ఉన్న సినిమాను ఎంచుకొని సినిమా చేస్తే.. సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేయగలుగుతారు.  ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కటి కంటే ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణం కూడా ఇదే కావొచ్చు.  

అయితే, హీరోయిన్స్ విషయంలో అలా ఉండదు.  వీరికి కంబినేషన్ ముఖ్యం.  స్టార్ హీరోలతో సినిమా ఉంటె ఖచ్చితంగా ఓకే చెప్పేస్తారు.  ఇక సినిమా హిట్టయితే.. దానిని అనుసరించి మరికొన్ని సినిమాలు చేతికి అందుతాయి.  ఈ ఏడాది ప్రథమార్ధంలో సీనియర్ హీరోయిన్స్ కు ఎలా కలిసి వచ్చిందో.. కొత్త హీరోయిన్స్ కు కూడా కలిసి వచ్చింది.  

సీనియర్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే మొదట అనుష్క గురించి చెప్పుకోవాలి.  గతేడాది అనుష్క నటించిన బాహుబలి 2 సూపర్ హిట్ అయింది.  అదే హిట్ ను ఈ ఏడాది బాగమతిలో కూడా కొనసాగించింది.  భాగమతిలో తనే హీరో.. లేడీ ఓరియంటెడ్ సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.  

అనుష్క తరువాత సమంత ..ఈ ఏడాది సమంత మూడు విజయాలను అందుకున్నది.  రంగస్థలం, మహానటి సినిమాల్లోని సమంత నటనకు జనాలు ఫిదా అయ్యారు.  ఇక విశాల్ తో కలిసి నటించిన అభిమన్యుడు కూడా సూపర్ హిట్ కావడంతో మూడు విజయాలతో సమంత దూసుకుపోతున్నది.  అటు కీర్తి సురేష్ కూడా మహానటి విజయంతో టాప్ లిస్ట్ లో చేరిపోయింది.  

టచ్ చేసి చూడు సినిమా భారీ ప్లాప్ కావడంతో డీలా పడ్డ రాశి ఖన్నా, తొలిప్రేమతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  మూడు షేడ్స్ తో ఉన్న రోల్ లో రాశి ఖన్నా అద్భుతంగా నటించింది.  ఇక ఈ ఏడాది తొలి ప్రయత్నంతోనే విజయాలు నమోదు చేసుకున్న కైరా అద్వానీ, అదితి రావు హైదరి, రష్మికలు తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు.  భరత్ అనే నేను విజయం తరువాత కైరా అద్వానీ రామ్ చరణ్ తో సినిమా చేస్తోంది.  ఛలో తో మంచి హిట్ కొట్టిన రష్మిక ఇప్పుడు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది.