రష్మికకు నటనకంటే.. ఇదే ఇష్టమట..!!

రష్మికకు నటనకంటే.. ఇదే ఇష్టమట..!!

ఛలో సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన.  రష్మికకు అనుకోకుండా గీత గోవిందం సినిమాలో ఛాన్స్ వచ్చింది.  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది.  ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది.  ఇప్పటికే రూ.100 కోట్లు వసూలు చేసి విజయ్ దేవరకొండ రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నది.  

రష్మిక తన నటన గురించి విజయం గురించి మీడియాతో ముచ్చటించింది.  తన విజయానికి మూలకారణం దర్శకులే అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది.  తాను హోమ్ వర్క్ చేసి రానని, ఇంట్లో, ఫ్రెండ్స్ తోను ఎలా  సరదాగా ఉంటానో అలాగే సెట్స్ లో ఉంటానని, సహజంగా నటిస్తానని చెప్పుకొచ్చింది.  సినిమాలో తన పాత్ర గురించి పెద్దగా ఆలోచించనని చెప్పిన రష్మిక, చదువంటే చాలా ఇష్టం అని పేర్కొంది.  ఒకవేళ నటి కాకపోయి ఉంటె..జర్నలిజం లేదా సైకాలజీలో మాస్టర్ డిగ్రీ చేసేదట.