సొంతగానే అదితి రావు హైదరి

సొంతగానే అదితి రావు హైదరి

తెలుగు సినిమాల్లో నటించే పరభాషా కథానాయికలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు నేర్చుకోవోడం కాస్త కష్టమైన ఎలాగోలా నేర్చేసుకుని తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్తున్నారు. సమంత, కీర్తి సురేష్, సాయి పల్లవిలు తమ సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం మొదలెట్టారు. తాజాగా ఇదే కోవలోకి మరో హీరోయిన్ చేరిపోయారు. ఆమె మరెవరో కాదు అదితి రావు హైదరి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదామా. 

మణిరత్నం తీసిన చెలియా సినిమాతో అధితి రావు హైదరి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు. తాజాగా ఈమె మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'సమ్మోహనం' సినిమాలో హీరోయిన్ గా నటించింది. షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టారు. ఇందులో భాగంగానే ఈమె తెలుగు నేర్చుకుని తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొంటోంది. మాములుగా మోహన్ కృష్ణ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చిత్రం ఓ స్టార్ కి సామాన్య ప్రేక్షకుడికి మధ్య జరిగే ప్రేమ కథగా ఉండనుంది. జూన్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా , శ్రీ దేవి మూవీస్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.