కాబూల్ ఆత్మహుతి దాడి... 12మంది మృతి 

కాబూల్ ఆత్మహుతి దాడి... 12మంది మృతి 

అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12మంది మృతి చెందారు. ఈరోజు రూరల్‌ రిహాబిలిటేషన్‌ అభివృద్ధి శాఖ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద జరిగిన ఈ ఘటనలో 31మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీస్‌ అధికారి హష్మత్ మాట్లాడుతూ... 'పునరావాస కేంద్ర ప్రధాన ద్వారం వద్ద జరిగిన ఈ ఘటనలో చనిపోయిన వాళ్లలో పిల్లలు, మహిళా ఉద్యోగులే  ఎక్కువగా ఉన్నారు. రంజాన్‌ మాసం కావడంతో ఉద్యోగులందరూ మధ్యాహ్నం ఒంటిగంటకే ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆ ఘటన జరిగింది. బాంబులు కలిగిన ఓ సాయుధుడు ప్రధాన ద్వారం ద్వారా లోపలికి చొరబడ్డాడు. ఉద్యోగులంతా అప్పుడు ఇంటికెళ్తుండటంతో పెద్ద ఘోరం జరిగింది' అని ఆయన తెలిపారు.