హార్ధిక్‌ పాండ్యాకు మరో షాక్‌..!

హార్ధిక్‌ పాండ్యాకు మరో షాక్‌..!

'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై వివాదాస్పద కామెంట్స్‌ చేసిన టీమిండియా క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యాకు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పాండ్యాతోపాటు కేఎల్‌ రాహుల్‌పై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు వేయగా ఇప్పుడు స్పాన్సర్లు కూడా పునరాలోచనలో పడ్డారు. తాజాగా.. జిల్లెట్ సంస్థ పాండ్యాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పిస్తున్నట్టు ప్రకటించింది. మిగతా బ్రాండ్లు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంటే అతడు ఆర్థికంగా మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఒప్పో, గల్ఫ్ ఆయిల్, సిన్ డెనిమ్, డీఎఫ్‌వై స్పోర్ట్స్ వంటి బ్రాండ్స్‌కు కూడా పాండ్యా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షో‌లో పాండ్యా వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.