కేన్స్‌లో ఐష్‌-ఆరాధ్య మెరుపులు

కేన్స్‌లో ఐష్‌-ఆరాధ్య మెరుపులు

కేన్స్‌లో భార‌తీయ సుంద‌రీమ‌ణుల హొయ‌లు ప్ర‌త్యేక శోభ‌ను నింపాయి. ఇప్ప‌టికే అందాల దీపిక ప‌దుకొన్‌, క్వీన్ కంగ‌న ర‌నౌత్ గ్లింప్స్‌తో కేన్స్ న‌గ‌రం త‌రించింది. అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో ఇండియ‌న్ బ్యూటీస్ డామినేష‌న్ కొన‌సాగింది. ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్‌! అన్న చందంగా ఈ ఆదివారం మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ వంతు. 

ఐష్ ఈ ఉత్స‌వాల్లో అంద‌రినీ డామినేట్ చేస్తూ సీతాకోక సౌంద‌ర్యంతో ఆక‌ట్టుకుంది. త‌న‌కోస‌మే ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన బ్లూ& బ్లాక్ కాంబినేష‌న్ డిజైన‌ర్ వేర్‌లో ర్యాంప్ వాక్ చేసింది. 16 సంవ‌త్స‌రాలుగా ఐశ్వ‌ర్యారాయ్ కేన్స్ ఉత్స‌వాల్లో త‌ళుకుబెళుకుల‌తో ఆక‌ట్టుకుంటూనే ఉంది. ఈ ఏడాది 17వ సారి ఈ ఉత్స‌వాల్లో పాల్గొనే అవ‌కాశం అందుకుంది. ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌తో పాటు బేబి ఆరాధ్య ఈ వేడుక‌ల్లో ర్యాంప్ వాక్ చేయ‌డం మ‌రో హైలైట్. ఆరాధ్య త‌న‌తో పాటు ర్యాంప్‌ వాక్ చేస్తున్న‌ వీడియోని ఐశ్వ‌ర్యారాయ్ స్వ‌యంగా త‌న ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో క్యూట్ ఆరాధ్య ఎరుపు రంగు డ్రెస్‌లో న‌వ్వులు చిందిస్తూ ఆక‌ట్టుకుంది. 10 సెక‌న్ల ఆ దృశ్యాన్ని స్లోమోష‌న్‌లో అద్భుతంగా చిత్రీక‌రించారు. ఆస‌క్తి రేకెత్తిస్తున్న ఈ వీడియో ప్ర‌స్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.