మిస్టర్ మజ్ను ట్రైలర్: నాకు అలా లవ్ చేయడం చేతకాదు

మిస్టర్ మజ్ను ట్రైలర్: నాకు అలా లవ్ చేయడం చేతకాదు

అక్కినేని యువ హీరో 'అఖిల్' న‌టించిన తాజా చిత్రం 'మిస్ట‌ర్ మ‌జ్ను'. అఖిల్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌లకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్‌, సాంగ్స్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఇవాళ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అఖిల్ రోజా పువ్వు పట్టుకొని వస్తుండగా ట్రైలర్ స్టార్ అయింది. 'లుక్ విక్కీ నువ్వు ఎంత  ట్రై చేసిన నేను నీకు పడను.. ఓకే థాంక్స్', 'అబ్బాయిల విషయంలో మాకు కొన్ని హై ఎక్సపెక్టషన్స్ ఉంటాయి' వంటి డైలాగ్స్ అలరించాయి. మరి ఆలస్యం ఎందుకు మీరూ చూడండి.