నేడు నగరానికి అఖిలేశ్‌

నేడు నగరానికి అఖిలేశ్‌

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ నేడు హైదరాబాద్‌ వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో అఖిలేశ్‌ హైదరాబాద్‌కు చేరుకుంటారు. బేగంపేట నుంచి అఖిలేశ్‌ నేరుగా సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్తారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ జరుపుతున్న సంప్రదింపుల్లో భాగంగా ఆయన నగరానికి వస్తున్నారు. కేసీఆర్‌తో సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిపై చర్చిస్తారు. సీఎం నివాసంలోనే అఖిలేశ్‌ మధ్యాహ్న భోజనం చేస్తారు. సాయంత్రం అఖిలేశ్‌ లఖ్‌నవ్‌ వెళ్లనున్నారు.