కేసీఆర్ ఆలోచనా విధానం బాగా నచ్చింది...

కేసీఆర్ ఆలోచనా విధానం బాగా నచ్చింది...

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనా విధానం తనకు బాగా నచ్చిందన్నారు యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్... ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేసీఆర్, అఖిలేష్‌ చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు... ప్రజలు మంచి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు అఖిలేష్‌. ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తేనే భారతీయ జనతా పార్టీని ఓడించగలమన్న యూపీ మాజీ సీఎం... దేశ ప్రజలను బీజేపీ నిరాశపరిచిందని... ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపణలు గుప్పించారు. 

రైతులు ఆనందంగా ఉంటేనే దేశం బాగుపడుతుందన్నారు అఖిలేష్ యాదవ్... ఇతర దేశాలతో పోల్చిచూస్తే భారత్ ఆశించినంత అభివృద్ధి చెందలేదన్నారు. సీఎం కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలు బాగున్నాయి. ప్రజా సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు గొప్పగా ఉన్నాయంటూ ప్రశంసించారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం మంచిదని... ఆయన ప్రయత్నానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు అఖిలేష్. యువశక్తిని మనం సద్వినియోగం చేసుకోవడం లేదని వెల్లడించారాయన.