సమంత అప్పుడే మొదలుపెట్టింది..!!

సమంత అప్పుడే మొదలుపెట్టింది..!!

అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు.  మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 31 న విడుదల కాబోతున్నది.  ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'అను బేబీ.. అలాకొచ్చిన అణుబాంబులా అలా చూడకే" అనే పల్లవితో సాగే వీడియో సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  సాంగ్ కలర్ఫుల్ గా ఉన్నది. శ్రావ్యమైన ట్యూన్ తో ఆకట్టుకునే పదాలతో అద్భుతంగా ఉన్నది. 

ఒక్కసారి వినగానే ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పాటపై సమంత తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది.  " ఈపాట చాలా బాగుంది... నాకెంతగానే నచ్చింది" అని ట్వీట్ చేసింది.  నాగ చైతన్య సినిమాలను సమంత ట్వీట్ చేస్తూ ప్రమోట్ చేస్తుంటుంది.  సమంత సినిమాలను నాగచైతన్య ప్రమోట్ చేస్తుంటాడు.  యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పటికే ఆకట్టుకుంటున్నది.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.