ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కోసం.. ఏఎన్నార్ కార్లో..!!

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కోసం.. ఏఎన్నార్ కార్లో..!!

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది.  మెయిన్ మెయిన్ సీన్స్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్నది.  చంద్రబాబు పాత్రకు సంబంధించిన షూట్ ఇటీవలే పూర్తయింది.  ప్రస్తుతం ఏఎన్నార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నది.  ఏఎన్నార్ పాత్రలో సుమంత్ అక్కినేని నటిస్తున్న సంగతి తెలిసిందే.  

ఏఎన్నార్ చివరిసారిగా వినియోగించిన కారులో సుమంత్ ఎన్టీఆర్ షూటింగ్ కు హాజరయ్యారు.  ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కు తాతగారి కారులో వెళ్లడం హ్యాపీగా ఉందని సుమంత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  మళ్ళిరావా హిట్ తరువాత సుమంత్ ఇదం జగత్ సినిమాలో నటిస్తున్నాడు.