ప్రైవేట్ ఫొటోస్ లీక్ పై అక్షరా హాసన్ ఫిర్యాదు

ప్రైవేట్ ఫొటోస్ లీక్ పై అక్షరా హాసన్ ఫిర్యాదు

అక్షరా హాసన్ ప్రైవేట్ ఫోటోలు ఇంటర్నెట్ లో లీకైన సంగతి తెలిసిందే.  తన మొబైల్ లో ఉన్న ఫోటోలను ఎలా లీక్ అయ్యాయో అర్ధంగా అక్షరా హాసన్ ముంబై సైబర్ సెల్ ను ఆశ్రయించింది. తన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేశారని కంప్లైంట్ ఇచ్చింది.  

అక్షరా హాసన్ కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.  అక్షరా హాసన్ సెల్ హ్యాక్ కు గురయినట్టుగా కనిపెట్టారు.  హ్యాక్ చేసింది ఎవరు... ఎందుకు చేశారు అనే దానిపైనా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  దేశంలో మీటు ఉద్యమం భారీ స్థాయిలో జరుగుతున్న సమయంలో హీరోయిన్ ఫోటోలు లీక్ కావడం సంచలనంగా మారింది.  తన ఫోటోలు లీక్ కావడం తనని తీవ్రంగా బాధించిందని చెప్పి ట్వీట్ చేసింది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@mumbaipolice @cybercrime_cell

A post shared by Akshara Haasan (@aksharaa.haasan) on