అకుల్ రోల్ మారింది

అకుల్ రోల్ మారింది

తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి అకున్‌ సభర్వాల్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులతో పాటు, పౌర సరఫరాల సంస్థ, లీగల్‌ మెట్రాలజీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మూడు విభాగాలకు సంబంధించి కార్యకలాపాలను ఈరోజు ఆయన సమీక్షించారు. పౌరసరఫరాల శాఖలో ఐటీ ప్రాజెక్టుల అమలు తీరుపై అధికారులను అడిగి అకుల్ సభర్వాల్ తెలుసుకున్నారు.

అలాగే.. కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి.. రేషన్ బియ్యాన్ని తరలించే వాహనాల కదలికలు.. గోదాముల్లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఇంకా ఈ- పాస్‌ యంత్రాల పనితీరు, ఈ- వెయింగ్‌ మిషన్‌, టీ-రేషన్‌ యాప్‌, రేషన్‌ పోర్టబిలిటీ వంటి వాటి గురించి కమిషనర్‌కి ఐటీ అధికారులు వివరించారు. ఆ తర్వాత వినియోగదారుల ఫోరం, పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్, టోల్‌ ఫ్రీ నెంబరు, వాట్సప్‌ కంట్రోల్ రూమ్ పనితీరులను అడిగి తెలుసుకున్నారు. ఏ అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయనే దానిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం అందుతుంది.