సివిల్‌ శాఖలోనూ అకున్ ప్రతాపం

సివిల్‌ శాఖలోనూ అకున్ ప్రతాపం

ఏ శాఖలో ఉన్నా తనదైన శైలిలో దూసుకు వెళుతూ డాషింగ్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్.. గతంలో టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ కేసును ఒత్తిడిలకు తలొగ్గకుండా దర్యాప్తు చేపట్టారు. తాజాగా తూనికలు కొలతల శాఖలోనూ అక్రమార్కుల భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. నగరంలోని వివిధ షాపింగ్ మాల్స్‌లో ఎమ్మార్పీ ధరలకన్నా అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో.. స్పందించిన అకున్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌పై దాడులు నిర్వహించారు. ఒకేరోజులో 102 కేసులు నమోదు చేసి.. మొత్తం 23 లక్షల విలువైన వస్తువులను సీజ్ చేసి.. జరిమానా విధించారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌లో 30 కేసులు నమోదు చేసి.. 3.50 లక్షలు.. జీవీకే‌లో 17 కేసులు నమోదు చేసి.. 3.4 లక్షలు.. ఫోరం సుజనా మాల్‌లో 15 కేసులు నమోదు చేసి .. 90 వేలు జరిమానా విధించారు.