రిటైర్‌మెంట్ ప్రకటించిన మోర్కెల్

రిటైర్‌మెంట్ ప్రకటించిన మోర్కెల్

సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఆల్బీ మోర్కెల్ (37) రిటైర్‌మెంట్ ప్రకటించారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు మోర్కెల్ ప్రకటించారు. 20 సంవత్సరాల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో మోర్కెల్ 1 టెస్ట్, 58 వన్డేలు, 50 టీ20లు ఆడారు. మోర్కెల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 1,412 రన్స్, 77 వికెట్లు సాధించాడు. 2004లో మోర్కెల్ వన్డేలలో ఆరంగేట్రం చేసారు. 58 వన్డేలలో 782 పరుగులు, 50 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. వన్డే ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97. 50 టీ20లలో 572 పరుగులు, 26 వికెట్లను తీశారు. ఇక ఒక టెస్టులో 58 పరుగులు, 1 వికెట్ తీశారు.

ఆల్బీ మోర్కెల్ టీ-20 లీగ్ లలో తన సత్తా చాటాడు. అన్ని టీ20లలో 4,247 పరుగులు, 247 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసాడు. చెన్నై తరపున 974 పరుగులు, 85 వికెట్లను తీశారు. 2011 లో చెన్నై టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.

'నాకు క్రికెట్ ఆడే వయసు అయిపొయింది. ఇక క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నా. గత 20 సంవత్సరాలు గొప్ప ప్రయాణం చేశాను. ఎన్నో తీపి గుర్తులు, చేదు అనుభవాలు. సుదీర్ఘ కెరీర్ దక్కడం నా అదృష్టం. క్రికెట్ సౌతాఫ్రికాకి, టైటాన్స్ క్రికెట్‌కి ధన్యవాదాలు. ఫామిలీ, ఫ్రెండ్స్, ఫాన్స్ కి కృతజ్ఞతలు. నా  ప్రయాణంలో ముఖ్య పాత్ర పోషించిన నా భార్యకు ధన్యవాదాలు' అని ఆల్బీ ట్వీట్ చేశారు.