పవన్‌కల్యాణ్‌ను కలిసిన అలీ..

పవన్‌కల్యాణ్‌ను కలిసిన అలీ..

ప్రముఖ సినీనటుడు అలీ.. ఇవాళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిశారు. జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు.. అలీని వెంటబెట్టుకుని అమరావతిలో వపన్‌కల్యాణ్‌ ఇంటికి వెళ్లారు. వైసీపీలో ఈ నెల 9వ తేదీన అలీ చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన స్నేహితుడు, గురువు, మార్గదర్శకుడిగా పవన్‌ను చెప్పుకునే అలీ.. ఆయన సలహాలు తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది. దాదాపు 2 గంటలపాటు పాటు వీరి భేటీ కొనసాగింది.