పైరసీ భూతంపై అలియా యుద్ధం

పైరసీ భూతంపై అలియా యుద్ధం

వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. సినిమా థియేటర్స్ లో విడుదలైన కాసేపటికే పైరసీ వైరస్ లా పట్టేస్తోంది.  కాసేపటికే అంతర్జాలంలో సినిమా వచ్చేస్తోంది.  వందలాది మంది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు, పైరసీని అరికట్టేందుకు ఎన్ని మార్గాలు అనుసరిస్తున్నా లాభంలేకుండా పోతున్నది.  లాభాలు తీసుకొచ్చే సినిమాలు సైతం ఈ పైరసీ భూతం వల్ల నష్టపోవలసి వస్తోంది. ప్రతి సినిమా విడుదలకు ముందు నిర్మాతలు, హీరోలు, దర్శకులు పైరసీ గురించి మాట్లాడనున్నా లాభం లేకుండా పోతున్నది.  

పైరసీపై అలియా పోరాటం మొదలుపెట్టింది.  రాజీ వంటి మంచి సినిమాలో నటించి మెప్పించిన అలియా భట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తో చేతులు కలిపి పైరసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టింది.  పైరసీ చేసేవారే కాదు, పైరసీ వీడియోలను చూసేవారు కూడా నేరం చేసిన వాళ్ళతో సమానమే. పైరసీని అడ్డుకోవడం ఒక్కరోజులోనే.. ఒక్కరి చేతిలోనో జరిగే పనికాదు.  అందరు చేయి చేయి కలిపితేనే ఈ పైరసీని అడ్డుకట్ట వేయగలిగారు.  ఈరోజు సినిమాలు పైరసీ అవుతాయి.  రేపు మనం కష్టపడి షూట్ చేసుకున్న ఫ్యామిలీకి సంబంధిన ఫోటోలు, వీడియోలు కూడా పైరసీ కావొచ్చు.  అప్పుడు బాధపడే బదులు, ఇప్పటి నుంచి పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. తప్పకుండా పైరసీకి అడ్డుకట్ట వేయవచ్చు.  అందుకే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ సే నో టు పైరసీ ఉద్యమాన్ని ప్రారంభించింది.  ఈ ఉద్యమంలో అందరు పాల్గొని పైరసీని రూపుమాపాలని విజ్ఞప్తి చేస్తోంది.