ఈరోజు మైండ్‌స్పేస్ జంక్షన్ ఫ్లైఓవ‌ర్‌ ప్రారంభం

ఈరోజు మైండ్‌స్పేస్ జంక్షన్ ఫ్లైఓవ‌ర్‌ ప్రారంభం

హైదరాబాద్ లో ఇవాళ మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పనులు చేపట్టారు. రూ. 108.59కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ ను రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్విందకుమార్, జీహెచ్ఎంసి కమిషనర్ ఎం. దానకిషోర్ లు ఉదయం 10.30గంటలకు ప్రారంభిస్తారు.