గీత గోవిందం హిట్ తో షాకైన హీరోలు

గీత గోవిందం హిట్ తో షాకైన హీరోలు

గీత గోవిందం ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.  మోడరేట్ సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది.  వర్కింగ్ డే రోజున కూడా భారీ కలెక్షన్లు వసూలు చేయడంతో కేవలం 12 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.  యూఎస్ లో 2 మిలియన్ల మార్కును చేరుకొని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.  ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని అల్లు కాంపౌండ్ హీరోలు ఊహించలేదు.  

అసలే హిట్ లేక ఇబ్బంది పడుతున్న అల్లు అర్జున్ కు గీత గోవిందం ఎందుకు మిస్ చేసుకున్నాను అని బాధపడిపోతున్నాడు.  గీత గోవిందం కథ విన్న అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించేందుకు ఎందుకు సాహసించలేదు అర్ధం కాలేదు.  అల్లు శిరీష్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపాడట.  పరశురామ్.. అల్లు శిరీష్ కాంబినేషన్లో వచ్చిన శ్రీరస్తు.. శుభమస్తు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.  ఈ హిట్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తే బాగుంటుందని అల్లు శిరీష్ భావించినా అది వర్కౌట్ కాలేదు.  అల్లు హీరోలను ఇద్దరిని పక్కన పెట్టి అల్లు అరవింద్ .. అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.  అసలు ఈ రేంజ్ లో హిట్టవుతుందని దర్శక నిర్మాతలు కూడా భావించకపోవడం విశేషం.