అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు..

అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు..

అల్లు అర్జున్ నాపేరు సూర్య.. సినిమా పరాజయం తరువాత ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే దానిపై ఇటీవలే క్లారిటీ వచ్చింది. మనం వంటి మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో బన్నీ చేతులు కలిపాడు.  త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.  ప్రస్తుతం విక్రమ్ స్క్రిప్ట్ వర్క్ బిజీలో ఉన్నారు.  వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువడటమే ఆలస్యం.  

విక్రమ్ తో సినిమా తరువాత మరో ఇద్దరు దర్శకులతో బన్నీ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తోనూ, రేసు గుర్రం వంటి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డితోను సినిమా చేసేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడు.  ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా పూర్తయ్యాక బన్నీతో చేస్తాడట.  అలాగే, మెగాస్టార్ తో సైరా పూర్తయ్యాక సురేందర్ రెడ్డి బన్నీ ప్రాజెక్ట్ కు సైన్ చేస్తారని తెలుస్తోంది.  మిగతా హీరోల్లాగే అల్లు అర్జున్ కూడా తన తరువాత ప్రాజెక్ట్ లను ప్రకటించాడన్నమాట.