వీడియో: కూతురితో బ‌న్నీ ఆట‌లు

వీడియో: కూతురితో బ‌న్నీ ఆట‌లు

టాలీవుడ్ హీరోలు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా.. కొద్ది సమయం దొరికితే ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుపుతుంటారు. ఈ వరుసలో 'సూపర్ స్టార్' మహేష్ బాబు, 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్లు ముందుటారు. బన్నీ చివ‌రిగా నటించిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' అంతగా ఆడకపోవడంతో.. త‌దుప‌రి సినిమాతో పక్కా హిట్ కొట్టాలని గ్యాప్ తీసుకొని ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌డం లేట్ అవుతుంది. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తన కూతురితో సరదాగా గడిపాడు.

అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలకు అయాన్‌, అర్హ అనే ఇద్ద‌రు పిల్ల‌లు. అర్హని ఎక్కువ‌గా ప్రేమించే బ‌న్నీ తాజాగా ఆమెతో కలిసి స‌ర‌దాగా గడిపాడు. 'నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని కూతురిని అడగ్గా.. చేసుకోను అని చెబుతుంది. ఎన్ని సార్లు అడిగినా కూడా అర్హ చేసుకోను అని చెపుతోంది. దీంతో దొంగ ఫెల్లో.. నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకో అని బన్నీ కూతురిని బ్ర‌తిమిలాడతాడు'. ఈ వీడియోని బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి ఆలస్యం ఎందుకు మీరూ చూడండి.