రోబోలతో 'అమెజాన్‌' డోర్‌ డెలివరీ!

రోబోలతో 'అమెజాన్‌' డోర్‌ డెలివరీ!

అమెజాన్‌ ప్రైమ్‌.. దీని గురించి తెలియని వారుండరు. అమెజాన్‌ ప్రైమ్‌లో మనకు కావాల్సిన వస్తువు ఇలా ఆర్డర్‌ పెడితే.. అలా చేతికందుతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యే అమెజాన్‌ ప్రైమ్‌.. ఇప్పుడు రోబోలను రంగంలోని దించింది. లైట్‌ బ్లూ కలర్‌లో ఉండే ఈ డెలివరీ రోబోకు ఆరు చక్రాలను అమర్చారు. బ్యాటరీతో పనిచేసే ఈ రోబోలు తమంతట తామే.. సూచించిన అడ్రస్‌కు వెళ్లి సరుకులు డెలవరీ ఇస్తాయి. అంటే.. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ డెలివరీ అన్నమాట. ఎదురుగా ఎవరైనా వస్తే.. సైడిచ్చి మరీ దూసుకెళ్తాయి. పక్కనెవరున్నారో.. ముందునేముందో.. చూసుకుని ముందుకెళ్తాయి. 'స్కౌట్‌'గా నామకరణం చేసిన ఈ రోబోలను వాషింగ్టన్‌లోని స్నోహోమిష్‌ కంట్రీలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. తొలి దశలో తమ సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తారని.. తదనంతర దశలో ఇవి తమంతట తాము వెళ్లి డెలివరీ చేస్తాయని అమెజాన్‌ తెలిపింది.